యెహెజ్కేలు 30
  • 1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  • 2 నరపుత్రుడా, సమాచార మెత్తి ప్రవచింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగాఆహా శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమ దినము వచ్చెనే,
  • 3 యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము.
  • 4 ఖడ్గము ఐగుప్తు దేశముమీద పడును, ఐగుప్తీయులలో హతులు కూలగా కూషుదేశస్థులు వ్యాకులపడుదురు, శత్రువులు ఐగుప్తీ యుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టు దురు.
  • 5 కూషీయులును పూతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపువారును మిశ్రిత జనులంద రును ఖడ్గముచేత కూలుదురు.
  • 6 యెహోవా సెలవిచ్చునదేమనగాఐగుప్తును ఉద్ధరించు వారు కూలుదురు, దాని బలగర్వము అణగిపోవును, మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు జనులు ఖడ్గముచేత కూలుదురు.
  • 7 పాడైపోయిన దేశముల మధ్య ఐగుప్తీయులు దిక్కులేనివారుగా నుందురు, నలుదిక్కుల పాడైపోయిన పట్టణములమధ్య వారి పట్టణము లుండును.
  • 8 ఐగుప్తుదేశ ములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులు లేకుండ చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
  • 9 ఆ దినమందు దూతలు నా యెదుట నుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు, ఐగుప్తునకు విమర్శకలిగిన దినమున జరిగి నట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగో అది వచ్చే యున్నది.
  • 10 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఐగుప్తీ యులు చేయు అల్లరి బబులోనురాజైన నెబుకద్రెజరుచేత నేను మాన్పించెదను.
  • 11 జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరుచుటకు అతడు వచ్చును, ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గము లను ఒరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు.
  • 12 నైలునదిని ఎండిపోజేసి నేనా దేశమును దుర్జనులకు అమి్మ వేసెదను, పరదేశులచేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడుచేయించెదను, యెహోవానైన నేను మాట యిచ్చియున్నాను
  • 13 యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడువిగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధి పతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను.
  • 14 పత్రోసును పాడుచేసెదను. సోయనులో అగ్నియుంచెదను, నోలో తీర్పులు చేసెదను.
  • 15 ఐగుప్తునకు కోటగా నున్న సీనుమీద నా క్రోధము కుమ్మ రించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను
  • 16 ఐగుప్తుదేశములో నేను అగ్ని యుంచగా సీను నకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు.
  • 17 ఓనువారిలోను పిబేసెతు వారిలోను ¸°వనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు.
  • 18 ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచ బడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెర లోనికి పోవుదురు.
  • 19 ​నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
  • 20 పదకొండవ సంవత్సరము మొదటి నెల యేడవ దిన మున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  • 21 నరపుత్రుడా, నేను ఐగుప్తురాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు; కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా
  • 22 నేను ఐగుప్తురాజైన ఫరోకు విరోధినైయున్నాను, బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి, అతని చేతిలోనుండి ఖడ్గము జారిపడజేసెదను.
  • 23 ​ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.
  • 24 ​మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచు చుండగా ఫరో చావు దెబ్బతినిన వాడై మూల్గులిడును.
  • 25 బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరో చేతులను ఎత్తకుండచేసి, ఐగుప్తుదేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోనురాజు చేతికియ్యగా నేను యెహోవానైయున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు.
  • 26 నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.