యెహోషువ 19
  • 1 రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్యనుండెను.
  • 2 వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా
  • 3 హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా
  • 4 సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా
  • 5 బేత్లెబాయోతు షారూ హెను అనునవి,
  • 6 వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణ ములు.
  • 7 అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు.
  • 8 దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణ ముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము.
  • 9 షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి.
  • 10 మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూ నీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.
  • 11 వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయాము నకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి
  • 12 శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి
  • 13 అక్కడనుండి తూర్పు తట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను.
  • 14 దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.
  • 15 కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును.
  • 16 ఆ పట్టణము లును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూ నీయులకు కలిగిన స్వాస్థ్యము.
  • 17 నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను.
  • 18 వారి సరిహద్దు యెజ్రె యేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షీయోను అనహరాతు రబ్బీతు కిష్యోను
  • 19 అబెసు రెమెతు ఏన్గన్నీము
  • 20 ఏన్‌హద్దా బేత్పస్సెసు అను స్థలములవరకు
  • 21 సాగి తాబోరు షహచీమా బేత్షెమెషు
  • 22 అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను.
  • 23 వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
  • 24 అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీ యుల పక్షముగా వచ్చెను.
  • 25 వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు
  • 26 అలమ్మేలెకు అమాదు మిషె యలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి
  • 27 తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు
  • 28 ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను.
  • 29 అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.
  • 30 ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు.
  • 31 వాటి పల్లెలతో కూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
  • 32 ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీ యుల పక్షమున వచ్చెను.
  • 33 వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సిందూరవనమును అదామియను కను మను యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి
  • 34 అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూ లూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను.
  • 35 కోటగల పట్ట ణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు
  • 36 అదామా రామా హాసోరు
  • 37 కెదెషు ఎద్రెయీ ఏన్‌హాసోరు
  • 38 ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అను నవి; వాటి పల్లెలుగాక పందొమి్మది పట్టణములు.
  • 39 ఆ పట్ట ణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
  • 40 ఏడవ వంతు చీటి వారి వంశములచొప్పున దానీయుల పక్షముగా వచ్చెను.
  • 41 వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా
  • 42 ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను
  • 43 అయ్యా లోను యెతా ఏలోను
  • 44 తిమ్నా ఎక్రోను ఎత్తెకే గిబ్బెతోను
  • 45 బాలాతా యెహుదు బెనేబెరకు
  • 46 గత్రిమ్మోను మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను.
  • 47 దానీ యుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరునుబట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి.
  • 48 వాటి పల్లెలుగాక యీ పట్టణములు వారి వంశ ములచొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
  • 49 సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచి పెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి.
  • 50 యెహోవా సెలవిచ్చిన దానినిబట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశములోనున్న తిమ్న త్సెరహును అతని కిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలోనివసించెను.
  • 51 యాజకుడైన ఎలియాజ రును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీ యుల గోత్రములయొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకముచేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి.