లేవీయకాండము 7
  • 1 అపరాధపరిహారార్థబలి అతిపరిశుద్ధము. దాని గూర్చిన విధి యేదనగా
  • 2 దహనబలి పశువులను వధించుచోట అప రాధపరిహారార్థబలిరూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
  • 3 దానిలోనుండి దాని క్రొవ్వంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములలోని క్రొవ్వును
  • 4 రెండు మూత్ర గ్రంథులను డొక్కలపైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది క్రొవ్వును కాలేజముమీది వపను తీసి దాని నంతయు అర్పింపవలెను.
  • 5 యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠముమీద వాటిని దహింపవలెను; అది అపరాధపరిహారార్థబలి; యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను;
  • 6 అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.
  • 7 పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును.
  • 8 ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును.
  • 9 పొయ్యిమీద వండిన ప్రతి నైవేద్యమును, కుండలోనేగాని పెనముమీదనేగాని కాల్చినది యావత్తును, దానిని అర్పించిన యాజకునిది, అది అతనిదగును.
  • 10 అది నూనె కలిసినదేగాని పొడిదేగాని మీ నైవేద్యములన్నిటిని అహరోను సంతతివారు సమముగా పంచుకొనవలెను.
  • 11 ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధానబలిని గూర్చిన విధి యేదనగా
  • 12 వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంట లను అర్పింపవలెను.
  • 13 ఆ పిండివంటలేకాక సమాధానబలి రూపమైన కృతజ్ఞతాబలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను.
  • 14 ​మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలోనుండి ఒకదాని యెహోవాకు ప్రతిష్ఠార్పణ ముగా అర్పింపవలెను. అది సమాధానబలిపశురక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతనిదగును.
  • 15 ​సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతాబలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను; దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు.
  • 16 ​అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను.
  • 17 ​మిగిలినది మరు నాడు తినవచ్చును; మూడవనాడు ఆ బలిపశువు మాంస ములో మిగిలినదానిని అగ్నితో కాల్చి వేయవలెను.
  • 18 ఒకడు తన సమాధానబలి పశువుమాంసములో కొంచె మైనను మూడవనాడు తినినయెడల అది అంగీకరింపబడదు; అది అర్పించినవానికి సమాధానబలిగా ఎంచబడదు; అది హేయము; దాని తినువాడు తన దోషశిక్షను భరిం చును.
  • 19 అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తిన కూడదు; అగ్నితో దానిని కాల్చివేయవలెను; మాంసము విషయమైతే పవిత్రులందరు మాంసమును తినవచ్చును గాని
  • 20 ఒకడు తనకు అపవిత్రత కలిగియుండగా యెహో వాకు అర్పించు సమాధానబలి పశువుమాంసములో కొంచె మైనను తినినయెడల వాడు ప్రజలలోనుండి కొట్టివేయ బడును.
  • 21 ఎవడు మనుష్యుల అపవిత్రతనేగాని అపవిత్ర మైన జంతువునేగాని యే అపవిత్రమైన వస్తువునేగాని తాకి యెహోవాకు అర్పించు సమాధానబలిపశువు మాంస మును తినునో వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.
  • 22 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
  • 23 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఎద్దుదేగాని గొఱ్ఱదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తిన కూడదు.
  • 24 చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్ర మును తినకూడదు.
  • 25 ఏలయనగా మనుష్యులు యెహో వాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వు నైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
  • 26 మరియు పక్షిదేగాని జంతువుదేగాని యే రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు.
  • 27 ​ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.
  • 28 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
  • 29 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఎవడు యెహో వాకు సమాధానబలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలోనుండి తాను అర్పించునది యెహోవా సన్ని ధికి తేవలెను.
  • 30 అతడు తన చేతుల లోనే యెహోవాకు హోమద్రవ్యములను, అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను.
  • 31 యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును.
  • 32 సమాధానబలిపశువులలోనుండి ప్రతిష్ఠార్పణముగా యాజ కునికి కుడి జబ్బనియ్యవలెను.
  • 33 అహరోను సంతతివారిలో ఎవడు సమాధానబలియగు పశువురక్తమును క్రొవ్వును అర్పించునో కుడిజబ్బ వానిదగును.
  • 34 ఏలయనగా ఇశ్రా యేలీయుల యొద్దనుండి, అనగా వారి సమాధానబలి ద్రవ్యములలోనుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసికొని, నిత్యమైన కట్టడచొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతివారికిని ఇచ్చియున్నాను.
  • 35 వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేర దీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్య ములలోనుండినది అభిషేక మునుబట్టి అహరోనుకును అభి షేకమునుబట్టియే అతని సంతతివారికిని కలిగెను.
  • 36 ​వీటిని ఇశ్రాయేలీ యులు వారికియ్యవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్ట డగా నియమించెను.
  • 37 ​ఇది దహనబలిని గూర్చియు అప రాధపరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాపపరిహా రార్థబలినిగూర్చియు అపరాధ పరిహారార్థబలినిగూర్చియు ప్రతిష్ఠితార్పణమును గూర్చియు సమాధానబలినిగూర్చియు చేయబడిన విధి.
  • 38 ​ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణ ములను తీసికొని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండమీద మోషేకు ఆలాగుననే ఆజ్ఞాపించెను.