1 దినవృత్తాంతములు 24
  • 1 అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
  • 2 నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.
  • 3 దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.
  • 4 వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.
  • 5 ​ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.
  • 6 లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను.
  • 7 మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదా యాకు,
  • 8 మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు,
  • 9 అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,
  • 10 ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు,
  • 11 తొమి్మదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు,
  • 12 పండ్రెండవది యాకీమునకు,
  • 13 పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు,
  • 14 ​పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,
  • 15 ​పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు,
  • 16 పందొమి్మదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు,
  • 17 ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,
  • 18 ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను.
  • 19 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.
  • 20 శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,
  • 21 రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,
  • 22 ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,
  • 23 హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,
  • 24 ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,
  • 25 ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,
  • 26 మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.
  • 27 యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.
  • 28 మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.
  • 29 కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.
  • 30 మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.
  • 31 ​వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.