1 దినవృత్తాంతములు 8
  • 1 బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,
  • 2 మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.
  • 3 బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు
  • 4 అబీషూవ నయమాను అహోయహు
  • 5 గెరా షెపూపాను హూరాము
  • 6 ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;
  • 7 ​నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.
  • 8 వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక
  • 9 తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును
  • 10 ​యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.
  • 11 ​హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.
  • 12 ​ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.
  • 13 ​​బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.
  • 14 అహ్యోషాషకు యెరేమోతు
  • 15 జెబద్యా అరాదు ఏదెరు
  • 16 మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.
  • 17 జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు
  • 18 ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.
  • 19 యాకీము జిఖ్రీ జిబ్ది
  • 20 ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.
  • 21 అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమా రులు.
  • 22 ఇష్పాను ఏబెరు ఎలీయేలు
  • 23 అబ్దోను జిఖ్రీ హానాను
  • 24 హనన్యా ఏలాము అంతోతీయా
  • 25 ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.
  • 26 ​షంషెరై షెహర్యా అతల్యా
  • 27 ​యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.
  • 28 ​వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.
  • 29 ​గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;
  • 30 ​ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు
  • 31 ​గెదోరు అహ్యో జెకెరు అనువారు.
  • 32 మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి.
  • 33 ​నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.
  • 34 ​​యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.
  • 35 ​మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.
  • 36 ​ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.
  • 37 మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.
  • 38 ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.
  • 39 అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.
  • 40 ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.