యోబు 11
  • 1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగునప్రత్యుత్తరమిచ్చెను
  • 2 ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా.వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?
  • 3 నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా నుండ వలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?
  • 4 నా ఉపదేశము నిర్దోషమనియుదేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.
  • 5 దేవుడు నీతో మాటలాడిన మేలుఆయనే నీతో వాదించిన మేలు
  • 6 ఆయనే జ్ఞానరహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవుతెలిసికొందువునీ దోషములో అధిక భాగము దేవుడు మరచిపోయియున్నాడని తెలిసికొనుము.
  • 7 దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానముకలుగునా?
  • 8 అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమిచేయుదువు?పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగుదువు?
  • 9 దాని పరిమాణము బ ³ూమికంటె అధికమైనదిదాని వెడల్పు సముద్రముకంటె అధికమైనది
  • 10 ఆయన సంచారముచేయుచు ఒకని చెరలో వేసివ్యాజ్యెమాడ పిలిచినప్పుడుఆయన నడ్డగింప గలవాడెవడు?
  • 11 పనికిమాలినవారెవరో ఆయనే యెరుగును గదాపరిశీలనచేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదోఆయనే తెలిసికొనును గదా.
  • 12 అయితే అడవి గాడిదపిల్ల నరుడై పుట్టిననాటికిగానిబుద్ధిహీనుడు వివేకికాడు.
  • 13 నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినయెడలనీ చేతులు ఆయనవైపు చాపినయెడల
  • 14 పాపము నీ చేతిలోనుండుట చూచి నీవు దానివిడిచినయెడలనీ గుడారములలోనుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల
  • 15 నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవునిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు.
  • 16 నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవుదాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసికొనునట్లునీవు దానిని జ్ఞాపకము చేసికొనెదవు.
  • 17 అప్పుడు నీ బ్రదుకు మధ్యాహ్నకాల తేజస్సుకంటె అధికముగా ప్రకాశించునుచీకటి కమ్మినను అది అరుణోదయమువలె కాంతిగానుండును.
  • 18 నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు.నీ యింటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండు కొందువు.
  • 19 ఎవరి భయములేకుండ నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసెదరు.
  • 20 దుష్టుల కనుచూపు క్షీణించిపోవునువారికి ఆశ్రయమేమియు ఉండదుప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు.