యోబు 21
  • 1 అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను
  • 2 నా మాట మీరు జాగ్రత్తగా వినుడినా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక.
  • 3 నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదనునేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యముచేయవచ్చును.
  • 4 నేను మనుష్యునిగురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు?
  • 5 నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడినోటిమీద చేయి వేసికొనుడి.
  • 6 నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది.
  • 7 భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?
  • 8 వారుండగానే వారితోకూడ వారి సంతానమువారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.
  • 9 వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవిదేవుని దండము వారిమీద పడుట లేదు.
  • 10 వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును.
  • 11 వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురువారి పిల్లలు నటనము చేయుదురు.
  • 12 తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురుసానికనాదము విని సంతోషించుదురు.
  • 13 వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురుఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు.
  • 14 వారునీ మార్గములనుగూర్చిన జ్ఞానము మాకక్కరలేదునీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు.
  • 15 మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు?మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు
  • 16 వారి క్షేమము వారి చేతిలో లేదుభక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక.
  • 17 భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా.వారిమీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా.
  • 18 వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెనుగాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లుఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా.
  • 19 వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారుచేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక
  • 20 వారే కన్నులార తమ నాశనమును చూతురుగాకసర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక.తమ జీవితకాలము సమాప్తమైన తరువాత
  • 21 తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికిచింత ఏమి?
  • 22 ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా?పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.
  • 23 ఒకడు తన కడవలలో పాలు నిండియుండగనుతన యెముకలలో మూలుగ బలిసియుండగను
  • 24 సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండుఆయుష్యముతో మృతినొందును
  • 25 వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనోదుఃఖముగలవాడై మృతినొందును.
  • 26 వారు సమానముగ మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును.
  • 27 మీ తలంపులు నేనెరుగుదునుమీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.
  • 28 అధిపతుల మందిరము ఎక్కడ నున్నది?భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే.
  • 29 దేశమున సంచరించువారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట లేదా?
  • 30 అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురుఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.
  • 31 వారి ప్రవర్తననుబట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు?వారు చేసినదానినిబట్టి వారికి ప్రతికారము చేయువాడెవడు?
  • 32 వారు సమాధికి తేబడుదురుసమాధి శ్రద్ధగా కావలికాయబడును
  • 33 పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవిమనుష్యులందరు వారివెంబడి పోవుదురుఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగాపోయిరి.
  • 34 మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావుఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్నుఓదార్చ జూచెదరు?