యోబు 13
  • 1 ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను.నా చెవి దాని విని గ్రహించియున్నది
  • 2 మీకు తెలిసినది నాకును తెలిసేయున్నదినేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను.
  • 3 నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరుచున్నానుదేవునితోనే వాదింప గోరుచున్నాను
  • 4 మీరైతే అబద్ధములు కల్పించువారు.మీరందరు పనికిమాలిన వైద్యులు.
  • 5 మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.
  • 6 దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెమునాలకించుడి.
  • 7 దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదనచేయుదురా?ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?
  • 8 ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా?దేవుని పక్షమున మీరు వాదింతురా?
  • 9 ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా?లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరుఆయనను మోసముచేయుదురా?
  • 10 మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడలనిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును.
  • 11 ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా?ఆయన భయము మీ మీదికి రాదా?
  • 12 మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు.మీ వాదములు మంటివాదములు
  • 13 నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడినామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక.
  • 14 నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?చేసికొననుగాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను
  • 15 ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును.
  • 16 ఇదియు నాకు రక్షణార్థమైనదగునుభక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు.
  • 17 నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడినా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి.
  • 18 ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొనియున్నానునేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును.
  • 19 నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు?ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొనిప్రాణము విడిచెదను.
  • 20 ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను.
  • 21 నీ చెయ్యి నామీదనుండి తొలగింపుమునీ భయము నన్ను బెదరింపనీయకుము
  • 22 అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీ కుత్తర మిచ్చెదను నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము
  • 23 నా దోషములెన్ని? నా పాపములెన్ని?నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.
  • 24 నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి?నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?
  • 25 ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవువేధించెదవా?ఎండిపోయిన చెత్తను తరుముదువా?
  • 26 నీవు నాకు కఠినమైన శిక్ష విధించి యున్నావునా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగానీవు విధించియున్నావు
  • 27 బొండలలో నా కాళ్లు బిగించియున్నావునా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావునా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు
  • 28 మురిగి క్షీణించుచున్న వానిచుట్టుచిమ్మటకొట్టిన వస్త్రమువంటివానిచుట్టుగిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.