కీర్తనలు 125
తెలుగు పరిశుద్ధ గ్రంథము · 5 verses
- 1 యెహోవాయందు నమి్మక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
- 2 యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును.
- 3 నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాప కుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు.
- 4 యెహోవా, మంచివారికి మేలు చేయుము యథార్థహృదయులకు మేలు చేయుము.
- 5 తమ వంకరత్రోవలకు తొలగిపోవువారిని పాపముచేయువారితో కూడ యెహోవాకొనిపోవును ఇశ్రాయేలుమీద సమాధానముండును గాక.