కీర్తనలు 134
  • 1 యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార లారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
  • 2 పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను తించుడి.
  • 3 భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.