కీర్తనలు 130
  • 1 యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను.
  • 2 ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.
  • 3 యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?
  • 4 అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును.
  • 5 యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.
  • 6 కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కు వగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.
  • 7 ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
  • 8 ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.